మంథనిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ

మంథనిలో  ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంథనిలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. మంథని అంబేద్కర్  చౌరస్తాలో  మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు  ఓటింగ్  సరళిని చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామని కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఓటర్లు మెగ్గు చూపుతున్నారని చెప్పారు. 

ప్రజలకు  మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆరు గ్యారంటీల పథకాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు శ్రీధర్ బాబు. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.  ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వ పరిపాలనకు కొంత స్తబ్ధత ఏర్పడిందని చెప్పారు.   ఓటింగ్ ప్రశాంతంగా  జరుగుతుందన్నారు.