హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌లో ఇయ్యాల(జూన్ 14) గద్దర్ సినీ అవార్డుల ప్రదానం

హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌లో ఇయ్యాల(జూన్ 14) గద్దర్ సినీ అవార్డుల ప్రదానం
  • హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌లో ఘనంగా నిర్వహిస్తున్నరాష్ట్ర ప్రభుత్వం
  • హాజరుకానున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు శనివారం జరగనున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌ హాల్-4 లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు వేడుకలకు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 

దాదాపు 14 ఏండ్ల తర్వాత సినిమా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఎంపికైన ఒక్కో ఉత్తమ చిత్రానికి ఉత్తమ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌.. ఇలా మొత్తం నాలుగు అవార్డుల చొప్పున అందించనున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీలకు చెందిన అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు జరపనున్నారు. ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌సహా ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఐ అండ్​ పీఆర్​ స్పెషల్ కమిషనర్ హరీశ్‌‌‌‌ మాట్లాడుతూ, కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎస్‌‌‌‌కు వివరించారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సినీ రంగం నుంచి ఎక్కువమంది ప్రముఖులు వస్తున్నందున పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు.