
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో మణికొండలోని చిత్రపురి కాలనీలో గాయకుడు, రచయిత గద్దర్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ , రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఎమ్మెల్యే క్రాంతి, గాయకురాలు మధుప్రియ, జయరాజ్ పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు వక్తలు. పాట బ్రతికి ఉన్నంత కాలం గద్దర్ మనలో బ్రతికే ఉంటారన్నారు. గద్దర్ అంటే పేరు కాదు తిరుగుబాటు విప్లవమన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఉద్దేశించి పాడినటువంటి పాటలను గుర్తు చేస్తూ కళాకారులు ఆడి పాడారు