ధనుర్మాసం: పెళ్లీడు అమ్మాయిలు చేయాల్సిన పూజ ఇదే.. వివాహం తర్వాత అంతా మంచే జరుగుతుంది..!

ధనుర్మాసం: పెళ్లీడు అమ్మాయిలు చేయాల్సిన పూజ ఇదే.. వివాహం తర్వాత అంతా మంచే జరుగుతుంది..!

ధనుర్మాసం కొనసాగుతుంది.  వైష్ణవ దేవాలయాల్లో సందడి అంతా ఇంతా కాదు.  పూజలు.. వ్రతాలు.. అనుగ్రహభాషణాలు ఇలా అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  ఆడపిల్లల హడావిడి  అంతా ఇంతాకాదు.  ధనుర్మాసంలో అవివాహితులు గోదాదేవి సమేత రంగనాయకస్వామిని ( విష్ణుమూర్తి రూపంలో ఉన్న శ్రీకృష్ణపరమాత్ముడిని) పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని.. ఆ తరువాత జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందని పండితులుచెబుతున్నారు. 

 

  • ధనుర్మాసంలో పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు ఉదయాన్నే స్నానం చేసి .. వాకిట్లో ముగ్గులు పెట్టాలి. ముగ్గుల మధ్య గొబ్బెమ్మల నుంచి వాటిని పూలతో అలంకరించాలి. 
  • గడపకి పసుపు కుంకుమలు ... గుమ్మానికి పచ్చని తోరణాలు ఉండేలా చూసుకోవాలి. 
  • ధనుర్మాసంలో అనగా  2026 జనవరి 14 వరకు నిత్యం గోదాదేవి సమేత రంగనాథస్వామిని పూజిస్తూ ఉండాలి
  • ఇలా చేయడం వలన  గోదా సమేత రంగనాయకస్వామి అనుగ్రహంతో మనసుకి నచ్చిన వారితో వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు.  

పూర్వకాలంలో ఎవరు  చేశారంటే..!

లక్ష్మీదేవి అంశతో అవతరించిన గోదాదేవి, మధురభక్తికి నిలువెత్తు నిర్వచనంలా కనిపిస్తూ ఉంటుంది. రంగనాథస్వామిని మనస్పూర్తిగా ప్రేమించిన ... ఆమె ఆయనని భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ధనుర్మాసంలో స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తుంది.
 
 రంగనాథస్వామికి మనసిచ్చిన గోదాదేవి ఆ స్వామిపై పాశురాలను రచించింది. ధనుర్మాసం  నెలరోజుల పాటు ఆ పాశురాలను ...తిరుప్పావైగా స్వామివారి సన్నిధిలో గానం చేసింది. 
 
ప్రేమతో స్వామివారికి పూల మాలికలు అల్లి ఆయన మనసు గెలుచుకుందని పురాణాలు చెబుతున్నాయి.   తాను కలలు కన్నట్టుగానే రంగనాథస్వామిని పెళ్లాడింది. అందుకే వైష్ణవ దేవాలయాల్లో ఆయన  సన్నిధానంలో గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. 

వివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రులని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆరోగ్య సమస్యలకు వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.