మాన్​సూన్​ వెదర్​ని తట్టుకునే గాడ్జెట్స్​

మాన్​సూన్​ వెదర్​ని తట్టుకునే గాడ్జెట్స్​

సీజన్​కు సూట్ అయ్యేలా..

సీజన్​  మారినప్పుడల్లా ఆ సీజన్​కు తగ్గట్టు బట్టలు, చెప్పులు వాడుతుంటారు. అలాగే వాటితోపాటు కొన్ని గాడ్జెట్స్​ కూడా సీజన్​కు తగ్గట్టే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని వస్తువులు వాతావరణంలో మార్పులను తట్టుకుని పనిచేయాలి. అందుకే సీజన్​కు తగ్గ గాడ్జెట్స్​ మార్కెట్​లోకి వస్తుంటాయి. మరింకేం... ఈ మాన్​సూన్​ వెదర్​ని తట్టుకునే గాడ్జెట్స్​ వైపు ఒక లుక్కేయండి. 

యాక్షన్​​ కెమెరా

మాన్​సూన్​లో కూడా వెకేషన్స్​కి వెళ్తుంటారు చాలామంది. అలా వెళ్లేవాళ్లు కచ్చితంగా కెమెరా తీసుకెళ్తారు. కానీ, వానలో తడిస్తే పాడవుతుందనే భయం ఉంటుంది. ఆ సమస్యకు చెక్​ పెట్టేస్తుంది ఈ కెమెరా. ప్రోకస్ కంపెనీకి చెందిన వైపర్16ఎంపీ, 4కె హెడీ యాక్షన్​ కెమెరా ఇది. అరచేతిలో సరిగ్గా సరిపోతుంది. దీంతో ఫొటోలు, వీడియోలు కూడా తీయొచ్చు. చూడ్డానికి స్మార్ట్​గా ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నా వైఫై కనెక్ట్ అవుతుంది. పిక్చర్​ క్వాలిటీ చాలా బాగుంటుంది. వాటర్ ప్రూఫ్ కూడా. ఇందులో నార్మల్​ ఫొటోలే కాదు, స్లో మోషన్, లూప్ రికార్డ్, టైమ్ లాప్స్, టైమర్ వంటి స్పెషల్​ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ధర : రూ.6,711/–

వాటర్​ప్రూఫ్​ బ్లూటూత్

 ఫోన్ పట్టుకోకుండా మాట్లాడేందుకు వైర్​లెస్ ఇయర్ బడ్స్ వాడడం ఫ్యాషన్​ అయిపోయింది. బైక్, కార్, బస్​ల్లో జర్నీ చేస్తున్నా కూడా చెవిలో ఇయర్ పాడ్స్ ఉండాల్సిందే. కొందరికి అది అవసరం. కానీ, అలాంటివాళ్లకు వానాకాలం వస్తే ఒక ఇబ్బంది. అదేంటంటే... దారి మధ్యలో వర్షం పడితే చెవిలో పెట్టుకున్న ఇయర్ ఫోన్స్​ పాడవుతాయి. ఆ ప్రాబ్లమ్​కి సొల్యూషనే వాటర్​ ప్రూఫ్ బ్లూటూత్ ఇయర్ బడ్స్. ఇవి కూడా వైర్​లెస్​వే. దీని పేరు స్కైనోట్ ఎఫ్​డీ1ఎస్​ఎస్​ఎస్​21 ఎయిర్ పోర్ట్ వాటర్​ ప్రూఫ్​ స్టీరియో బ్లూటూత్. 
ధర : రూ.575/–

ట్రావెల్ పౌచ్​

ఎలక్ట్రానిక్ వస్తువులు తడిస్తే పాడవుతాయి. వాటిని వానాకాలంలో ఎంత జాగ్రత్తగా వాడితే అంత బెటర్. లేదంటే ఎంత ఖర్చుపెట్టి కొన్నవైనా ఒక్కదెబ్బతో పాడవుతాయి. అందుకని వాటిని తడవకుండా ఉంచాలి. ఒకవేళ అర్జెంట్​గా ఊరికి వెళ్లాల్సి వస్తే వాటర్​ ప్రూఫ్​ వాడడం బెటర్ ఆప్షన్. కాబట్టి ఫోన్​, ట్యాబ్​, పెన్​ డ్రైవ్​, రకరకాల గాడ్జెట్ల ఛార్జర్స్​ వంటి ఎలక్ట్రానిక్​ వస్తువుల కోసం స్పెషల్​గా తయారుచేసిందే ఈ బ్యాగ్​. దీని పేరు పోర్టబుల్ జిప్పర్డ్​ ఎక్స్​టర్నల్ హార్డ్ డ్రైవ్​ పౌచ్​. ​లంచ్​ బ్యాగ్​ సైజ్​లో ఉంటుంది. చేత్తో పట్టుకుని వెళ్లడం తేలిక. వాటర్ ప్రూఫ్​ బ్యాగ్ కావడం వల్ల దీన్ని డైరెక్ట్​గా వానలో తీసుకెళ్లినా పాడుకాదు.
ధర : రూ. 449/– 

నాన్​ స్టాప్ మ్యూజిక్​ కోసం..

దూర ప్రయాణాలు చేసేటప్పుడు బోర్​ కొట్టకుండా పాటలు వినే అలవాటు ఉంటుంది చాలామందికి. అయితే, దానికోసం చాలా వరకు వైర్​తో కనెక్ట్ చేసిన స్పీకర్లనే వాడతారు. వాటివల్ల అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడం, షాక్ కొట్టడం వంటి ప్రమాదాలు జరగొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే వైర్​లెస్​​, వాటర్​ప్రూఫ్​ స్పీకర్​​ వాడితే బెటర్. ఇప్పుడు ఇదే ట్రెండ్​ కూడా. పైగా బరువు చాలా తక్కువ. అరచేతిలో పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. వానలో తడిసినా పాడవ్వదు. వైర్​లెస్ కాబట్టి, బ్లూటూత్ కనెక్ట్​ చేసుకుని మ్యూజిక్ వినొచ్చు. దీన్ని ఇంట్లోనూ వాడొచ్చు. ఫుల్​గా ఛార్జింగ్ పెడితే దాదాపు ఆరు గంటలు బ్రేక్​ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని ఫీచర్స్​ ఉన్నాయని ధర ఎక్కువ అనుకుంటున్నారా? దీని ధర తక్కువే. 
ధర : రూ. 500/–