
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎందుకు స్పీడప్ కావడం లేదని గద్వాల కలెక్టర్ సంతోష్ సీరియస్ అయ్యారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్లపై ఎంపీడీవోలతో రివ్యూ చేశారు. అయిజ మండలంలో ఇండ్ల నిర్మాణం స్లోగా జరుగుతోందని, అక్కడి ఎంపీడీవోను వెంటనే బదిలీ చేయాలని డీపీవోను ఆదేశించారు. ఫీల్డ్ లో పర్యటించి పనులను వేగవంతం చేయాలన్నారు.
పది రోజుల్లో పనుల్లో వేగం పెరగకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్థిక స్తోమత సరిగా లేని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, డీపీవో నాగేంద్రం, గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.