
న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా, మిలటరీ లెవల్‌లో పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. బార్డర్‌లో ఇండో-చైనా తమ సైన్యాలను వేల సంఖ్యలో మోహరించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు.
బార్డర్‌లో సెక్యూరిటీ సవాల్‌గా మారిందని జైశంకర్ చెప్పారు. ఈ సంవత్సరం ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందేనన్నారు. గల్వాన్ ఘటనతో ఇరు దేశాల సంబంధాల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొందన్నారు. సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో దళాలను మోహరించడం ద్వారా ఇండియాతో 30 ఏళ్లుగా కొనసాగుతున్న సత్సంబంధాలు చెదిరేలా చైనా ప్రవర్తిస్తోందన్నారు.