గేమ్ ఛేంజర్ సాంగ్ వాయిదా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది

గేమ్ ఛేంజర్ సాంగ్ వాయిదా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు సంబందించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జరగండి.. జరగండి.. అంటూ సాగే ఈ పాటను దివాళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

మరో రెండు రోజుల్లో సాంగ్ రిలీజ్ అవనుంది అని ఫుల్ హ్యాపీగా ఉన్న మెగా ఫ్యాన్స్ కు షాకిచ్చారు గేమ్ ఛేంజర్ మేకర్స్. తాజాగా ఈ సాంగ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.. గేమ్ ఛేంజర్ ఆడియో డాక్యుమెంటేషన్‌లో నెలకొన్న సమస్యల కారణంగా పాటని వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తాము. రామ్‌చరణ్‌, శంకర్‌ ఫ్యాన్స్ వెయిటింగ్‌కి తగ్గ వర్త్ తో పాట ఉంటుంది. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకి సంబంధించి ప్రతిదీ ది బెస్ట్ ఉంటుంది. క్వాలిటీతో కూడిన వినోదాన్ని అందించేందుకు మా టీమ్‌ అహర్నిశలు కష్టపడుతున్నారు.. అంటూ నోట్ లో రాసుకొచ్చారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.