మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కోహ్లీకి కాదు.. అతనికి దక్కాలి: గౌతమ్‌ గంభీర్‌

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కోహ్లీకి కాదు.. అతనికి దక్కాలి: గౌతమ్‌ గంభీర్‌

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని   పరోక్షంగా టార్గెట్ చేయడం గౌతీకి అలవాటే. తాజాగా నిన్న పాకిస్థాన్ మీద విరాట్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించడంపై  గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకి బదులుగా కుల్దీప్ యాదవ్ కి దక్కాల్సిందని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. 

              
ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 228 టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లి(122), కేఎల్‌ రాహుల్‌(111) సెంచరీలతో అదరగొట్టగా.. బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఈ క్రమంలో కుల్దీప్ పై ప్రశంసల జల్లు ఈ మాజీ ఓపెనర్. గంభీర్ మాట్లాడుతూ "ఈ మ్యాచులో బ్యాటర్లందరూ అదరగొట్టారు. కానీ నాకు వ్యక్తిగతంగా కుల్దీప్ ప్రదర్శన బాగా నచ్చింది. కుల్దీప్‌ మరోసారి తన మ్యాజిక్ ని చూపించి సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు". అని చెప్పుకొచ్చాడు. మరి గంభీర్ కోహ్లీని  టార్గెట్ చేశాడా..? లేకపోతే కుల్దీప్ బౌలింగ్ నిజంగానే ఆకట్టుకుందా..? ఈ విషయం గంభీర్ కే తెలియాలి.