
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. ట్రైలర్ లాంచ్, ఆడియో రిలీజ్ ఈవెంట్లు పక్క రాష్ట్రాల్లో చేస్తుంటే, కొందరు మేకర్స్ ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అమెరికా దేశంలో ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో నయా ట్రెండ్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్ట్ చేస్తున్న డాకు మహారాజ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా ప్రమయూఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. అయితే డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా జనవరి 4న అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో సాయంత్రం 6:00 గంటలకి నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో బాలయ్య యూఎస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
?????? to become ????? ???? ?
— Sithara Entertainments (@SitharaEnts) November 23, 2024
Hello USA!!! Get ready to welcome the ??? ?? ?????? #NandamuriBalakrishna garu, This 4th January at Dallas, Texas for the GRAND #DaakuMaharaajEvent ???⚡️
?Dallas, Texas USA on 4th Jan @ 6PM Onwards! ?
Teaser -… pic.twitter.com/y43GkCNsRm
ఈ విషయం ఇలా ఉండగా సంక్రాంతి బరిలో దిగుతున్న టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "గేమ్ ఛేంజర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్ TX 75040 లొకేషన్ లో సాయంత్రం 6:00 గంటలకి ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
'Mega MASS'ive Event in the USA ?? ?
— Game Changer (@GameChangerOffl) November 22, 2024
The pre-release event of #GameChanger will happen in the USA - the first time ever for an Indian cinema ❤️?
? Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040
?️ 21st DEC, 6:00 PM ONWARDS
See you soon, America!
Event by… pic.twitter.com/rcjVCrDGOX
దీంతో టాలీవుడ్ లో రామ్ చరణ్, బాలయ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఇతర దేశాల్లో ఈవెంట్లు చెయ్యటంవలన సినిమా ప్రమోషన్స్ తోపాటూ ప్రపంచానికి తెలుగు సినిమాలు పరిచయం అవుతాయని అంటున్నారు. అలాగే టాలీవుడ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.