గత ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసింది 

గత ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసింది 
  • రాష్ట్ర స్పోర్ట్స్​ అథారిటీ చైర్మన్​ శివసేనా రెడ్డి 

మెదక్: గత పదేళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ పాలనలో క్రీడలు నిర్వీర్యం చేశాయని రాష్ట్ర స్పోర్ట్స్​ అథారిటీ చైర్మన్​ శివసేనా రెడ్డి అన్నారు.  మెదక్ లోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   రాష్ట్రం  నుంచి జాతీయ స్థాయిలో  పతకం సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందిస్తుందన్నారు.  

మెదక్​ లో  అన్ని క్రీడలను నిర్వహించేలా  20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సీఎం రేవంత్​ రెడ్డి,  జిల్లా కలెక్టర్​కు  ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.    మెదక్ జిల్లాకు స్విమ్మింగ్ పూల్ తో పాటు క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.   రాబోయే ఒలంపిక్స్ గేమ్స్ లో తెలంగాణ నుంచి బంగారు పతకాలు సాధించేలా సీఎం  క్రీడలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.  జాతీయస్థాయి క్రీడల్లో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రత్యేక గుర్తింపు సాధించాలని కోరారు.