- గాంధీలో ఘనంగా ఆర్‌ఎంవో డాక్టర్ శేషాద్రి పదవీ విరమణ
పద్మారావునగర్, వెలుగు: అధికారులు తమ విధి నిర్వహణలో ప్రదర్శించే వృత్తి నిబద్ధత, సేవా దృక్పథమే వారికి జీవితాంతం చెరగని గుర్తింపునిస్తాయని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి అన్నారు. ఆర్‌ఎంవో-1 డాక్టర్ శేషాద్రి పదవీ విరమణ మహోత్సవం గురువారం హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.
ఈ సందర్భంగా శేషాద్రి దంపతులతో పాటు పదవీ విరమణ పొందిన రేడియోగ్రాఫర్ జగన్నాథంను అధికారులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సూర్యాపేట హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రావణ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, టీఎన్జీవో ప్రతినిధులు, వివిధ విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు.
