గోవా ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే గణేశ్

గోవా ప్రొటెం స్పీకర్గా ఎమ్మెల్యే గణేశ్

గోవా ప్రొటెం స్పీకర్గా గణేశ్ గాంకర్ నియమితులయ్యారు. ఎమ్మెల్యేలందరిలో సీనియర్ కావడంతో ఆయనను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ఆయనతో ప్రమాణం చేయించారు.  గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడగా.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభ సమావేశం కానుంది. కొత్త ఎమ్మెల్యేలతో గణేశ్ రేపు ప్రమాణం చేయించనున్నారు. 

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 20 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్కు ఒక్క సీటు దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ముగ్గురు స్వతంత్ర్య అభ్యర్థులతో పాటు ఇద్దరు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 

మరిన్ని వార్తల కోసం..

అసెంబ్లీలో మంత్రి తలసాని vs ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా