వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య..

వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య..

యాదాద్రి, నల్గొండ, నల్గొండ అర్బన్, వెలుగు:   వినాయక నిమజ్జన శోభాయాత్ర నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో  భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నల్గొండలోని ఒకటో నెంబర్ విగ్రహం వద్ద రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, కమిటీ సభ్యులు శోభాయాత్రను ప్రారంభించారు.  

పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. నల్గొండలోని హనుమాన్ నగర్ ఒకటో నెంబర్ గణేష్ విగ్రహం దగ్గర లడ్డుని వేలంలో సతీష్ కుమార్ రూ5.లక్షల 116లకు దక్కించుకున్నారు. భువనగిరిలో నిమజ్జనం సమయంలో ఓ క్రేన్ వద్ద తాడు తెగడంతో ప్రమాదం జరిగింది. దీంతో అక్కడున్న వారికి గాయాలయ్యాయి.