ఊపందుకున్న గణేశ్ నిమజ్జనాలు..కిక్కిరిసిన హుస్సేన్సాగర్ తీరం

ఊపందుకున్న గణేశ్ నిమజ్జనాలు..కిక్కిరిసిన హుస్సేన్సాగర్ తీరం

హైదరాబాద్​ సిటీ, వెలుగు:   మహా నిమజ్జనానికి ముందే హుస్సేన్​సాగర్ ​తీరంలో నిమజ్జన జోరు కనిపిస్తోంది. అలాగే సిటీలోని పలు చెరువులు, బేబీ పాండ్స్​లో కూడా వందలాది గణపతి విగ్రహాల నిమజ్జనాలు చేస్తున్నారు. ప్రస్తుతం పీపుల్ ప్లాజాలో 8, నల్లగుట్ట, పీవీ ఘాట్ ప్రాంతాల్లో రెండు చొప్పున క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు చేస్తున్నారు. ఇందిరా పార్క్ ఎదురుగా ఎన్టీఆర్ స్టేడియంలో ఆర్టిఫిషియల్​పాండ్​ ఏర్పాటు చేసి 4 క్రేన్లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

 ట్యాంక్ బండ్ వద్ద వెయ్యి మంది పోలీసులను మోహరించినట్టు ఖైరతాబాద్​ ఏసీపీ శ్రీనివాస్​ తెలిపారు. సోమవారం నగరంతోపాటు వివిధ జిల్లాల నుంచి నిమజ్జనానికి గణనాథులు తరలివచ్చారు. ఆదివారం రాత్రి పూట దాదాపు నాలుగు వేల విగ్రహాలు నిమజ్జనం జరిగాయని ఏసీపీ తెలిపారు. ఇక ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వద్ద కేటాయించిన స్థలం వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. భక్తులు, వాహనాలతో పలు చోట్ల ట్రాఫిక్​జామ్ ​ఏర్పడింది.