రాజేంద్రనగర్లో ఆడదొంగల హల్ చల్.. అర్థరాత్రి చోరీకి స్కెచ్.. ముఠాగా వచ్చి దొంగతనానికి యత్నం..సీసీఫుటేజ్ లో రికార్డు కావడంతో లేడీ గ్యాంగ్ చోరీ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఆడదొంగల గ్యాంగ్ సంచారం కలకలం రేపుతోంది. ఆటోలో గ్రూపుగా వచ్చిన ఐదుగురు మహిళలు నిర్మాణంలో ఉన్న ఇంట్లో చోరీకి యత్నించారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. అదే ప్రాంతాలో మరో ఇంటిలో కూడా చోరీకి యత్నించినట్లు తెలుస్తోంది. ఇదంతా సీసీటీవీ లో రికార్డయ్యింది.. దీంతో స్థానికంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మహిళలు ఆటోలంచి దిగడం.. నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి ప్రవేశించడం, కొంత సమయానికి ఇంట్లోంచి తిరిగి వెళ్లడం స్పష్టంగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలు అర్థరాత్రి గ్రూపుగా ఎందుకు వచ్చారు.. నిర్మాణంలో భవనంలో ఏమైన చోరీ జరిగిందా..? అనేకోణంలో దర్యాప్తు చేపట్టారు.
