మత్స్యకారుల తరపున అసెంబ్లీలో పోరాడుతా : ఎమ్మెల్యే రఘునందన్ రావు

మత్స్యకారుల తరపున అసెంబ్లీలో పోరాడుతా  : ఎమ్మెల్యే రఘునందన్ రావు

మెదక్ జిల్లా : మల్లన్నసాగర్ లో చాపలు పట్టుకునే హక్కును బెస్త, ముదిరాజ్, గంగపుత్రులకు ఇవ్వాలని  దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బెస్త, ముదిరాజ్, గంగపుత్రుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతానని చెప్పారు. మల్లన్నసాగర్ లో 15వేల ఎకరాలు మత్స్యకారులకు ఇవ్వాలని కోరారు. ముదిరాజుల్లో ఐక్యత లేదు కాబట్టే కేసీఆర్ పరిపాలన నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ చాపలు వేయాలని, వాటిని పట్టుకోడానికి మత్స్యకారులకు హక్కులు కల్పించాలన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా.. చాపలను ఆంధ్ర వాళ్లకు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని చెరువులలో కేవలం కొర్రమినులను మాత్రమే పెంచాలని కోరారు. మెదక్ జిల్లా చేగుంటలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ కామెంట్స్ చేశారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కూడా పాల్గొన్నారు. 

మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం 

భారత ప్రభుత్వం మత్స్యకారుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంగ్లాండ్ కన్నా భారతదేశం ఎక్కువ చేపలను ఎగుమతి చేస్తోందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ రైతుల అభివృద్ధితో పాటు, మత్స్యకారుల కోసం కూడా ఆలోచిస్తున్నారని అన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతోనూ మాట్లాడుతామన్నారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకే ముదిరాజ్ సమస్యలను తెలుసుకోవడానికి తాను రాష్ట్రానికి వచ్చానని చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ G- 20 సదస్సుకు నాయకత్వం వహిస్తుందన్నారు. 
-