
కొవిడ్ వల్ల ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియని పరిస్థితి. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా విడుదల విషయంలో ఆచి తూచి అడుగు వేయక తప్పడం లేదు. ఆలియాభట్ లీడ్ రోల్‌లో సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘గంగూబాయ్ కథియావాడి’ కూడా లాస్ట్ ఇయర్ నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. జనవరి 6న కచ్చితంగా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వస్తోందని పోస్ట్‌పోన్ చేశారు. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా వాయిదా పడినా, గంగూబాయ్‌ని ఎప్పుడు తీసుకు రావాలనే విషయంపై క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదలవుతుందని కన్‌ఫర్మ్ చేశారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ థియేటర్స్ రీ ఓపెన్ చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయ్ లైఫ్ స్టోరీ ఇది. ఆమె పాత్రలో ఆలియా నటించింది. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించాడు. జయంతీలాల్ గడతో కలిసి భన్సాలీ నిర్మించాడు. 72వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ సినిమా ప్రీమియర్ కానుంది.