ఆరోపణలపై విచారణకు సిద్ధం : మాజీ మంత్రి గంగుల కమలాకర్

ఆరోపణలపై విచారణకు సిద్ధం : మాజీ మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: తన హయాంలో బియ్యం థాయిలాండ్ కు తరలిపోయినట్లు వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు అనవసరమైన ఆరోపణలు మానుకోవాలన్నారు. గురువారం చింతకుంటలోని బీఆర్ఎస్ అఫీస్ లో ఆయన మాట్లాడారు. కరీంనగర్ సీపీ ఇష్టానుసారంగా బీఆర్​ఎస్​ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

ఎల్ఎండీతో పాటు మిడ్ మానేర్ జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయాయని, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ కు అధికారంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. సమావేశంలో రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే సతీశ్​బాబు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.