గర్వపడేలా గని

గర్వపడేలా గని

వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబి, సిద్ధు ముద్ధ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 8న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వైజాగ్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో మా అన్నయ్య నిర్మాతగా మారుతున్నందుకు హ్యాపీ. ఇరవై ఏళ్ల అనుభవం ఆయనకుంది. వరుణ్ అంటే నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. సినిమాల్లోకి వచ్చాక తనపై రెస్పెక్ట్ కూడా వచ్చింది. తను సెలెక్ట్ చేసుకుంటున్న కథలు, అతని జర్నీ నన్ను గర్వపడేలా చేశాయి. ఇప్పటివరకు వరుణ్ నటించిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఈ సినిమా మరొక ఎత్తు. దీనికి తను పడ్డ కష్టం మామూలుది కాదు. ఆ  కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది.  సినిమా చూశా. చాలా బాగా నచ్చింది’ అని చెప్పాడు. వరుణ్‌‌తో ఏదో ఒకరోజు ‘కేజీయఫ్‌‌’ లాంటి సినిమా తీస్తానన్నారు అల్లు అరవింద్. ‘గని మూడేళ్ల కల. పవన్ కళ్యాణ్‌‌కి ‘తమ్ముడు’ సినిమా మైల్ స్టోన్ అయినట్టే, వరుణ్‌‌కి ‘గని’ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు కిరణ్ కొర్రపాటి. ఆనెస్ట్‌‌గా తీసిన ఈ మూవీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాతలు అల్లు బాబి, సిద్ధుముద్ద. హీరోయిన్ సయీ మంజ్రేకర్‌‌, నవీన్ చంద్ర, ‌‌ నరేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.