హయత్ నగర్​లో 500 కిలోల గంజాయి స్వాధీనం

హయత్ నగర్​లో  500 కిలోల గంజాయి స్వాధీనం
  • హయత్ నగర్​లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 500 కిలోల సరుకు స్వాధీనం

ఎల్​బీనగర్,వెలుగు: ఏపీ నుంచి ముంబయికి గంజాయి సప్లయ్ చేస్తున్న గ్యాంగ్​కు చెందిన ఒకరిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఏజెన్సీ ఏరియాకు చెందిన నర్సింగ రావు, షేక్ మహ్మద్, విజయ్ ప్రసాద్, కర్ణాటకకు చెందిన వెంకటేశ్(36) ఓ గ్యాంగ్​గా ఏర్పడి గంజాయి సప్లయ్ చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియా నుంచి రూ.2 వేలకు గంజాయి కొని ముంబయికి తరలించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డీసీఎంలో సిమెంట్ బస్తాల మధ్యలో గంజాయిని పెట్టి సిటీ మీదుగా ముంబయికి తీసుకెళ్తున్నారు.

గురువారం ఏపీ నుంచి ముంబయికి సిటీ మీదుగా గంజాయి లోడ్​తో వెళ్తున్న డీసీఎంను పెద్ద అంబర్ పేటలో హయత్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు. సిమెంట్ బస్తాలు మాత్రమే కనిపించడంతో వెహికల్​ను విడిచిపెట్టారు. మళ్లీ వెంటనే అల్టర్ అయ్యి వెహికల్​ను వెంబడించి అడ్డుకుని పూర్తిగా తనిఖీ చేశారు. సిమెంట్ బస్తాల మధ్యలో ఉన్న గంజాయిని గుర్తించారు.  సప్లయర్ వెంకటేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. రూ. కోటి 35 లక్షల విలువైన 550 కిలోల గంజాయి, డీసీఎం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎల్​బీనగర్​ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు.