గంజాయి మొక్క స్వాధీనం

గంజాయి మొక్క స్వాధీనం

నస్పూర్, వెలుగు : నస్పూర్​పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ జితేందర్ పోలీస్​సిబ్బందితో  కలిసి నస్పూర్ పట్టణంలోని ఆర్కే–5 కాలనీ డీ–216 క్వార్టర్ లో సల్లూరి శంకరమ్మ ఇంటిపై దాడులు చేశారు. 

ఇంటి ఆవరణలోని 2 మీటర్ల పొడవు గల గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కను సాగు చేస్తున్న గృహిణిపై కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.