కారులో 350 కిలోల గంజాయి స్వాధీనం..

కారులో 350 కిలోల గంజాయి స్వాధీనం..

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ ఎక్సైజ్​, ఎన్​ ఫోర్స్​మెంట్​ అధికారులు  గంజాయి స్మగ్లర్లను  పట్టుకున్నారు.  మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు సీలేరు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్​కు  కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు.  ఖమ్మం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్  అధికారులు భద్రాచలంలో తనిఖీలు నిర్వహించగా  బారికేడ్‌‌లను ఢీకొట్టి పరారయ్యారు. ఎక్సైజ్​ శాఖ అధికారులు కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి ఎక్సైజ్, పోలీసులకు సమాచారం అందించారు. ఇల్లెందు ఎక్సైజ్, పోలీసులు పట్టణంలోని కరెంట్​ ఆఫీస్ వద్ద ఆపేందుకు యత్నించగా ఎక్సైజ్ హెడ్  కానిస్టేబుల్ ను ఢీకొట్టి పారిపోతూ రైల్వేబ్రిడ్జి వద్ద  కరెంట్​ స్తంభాన్నీ ఢీకొట్టారు. ఎక్సైజ్, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారులోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను  మహారాష్ట్రలోని సోలాపూర్​కు చెందిన సాగర్ దుక్కడ్, అమూల్ రాందాస్, బాలాజీ మక్కాడ్లుగా గుర్తించారు.  వీరి నుంచి రూ. 21లక్షల విలువైన 350 కేజీల 70 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం పరుచుకున్నామని ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి  ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బాబాను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించామని చెప్పారు.