
హైదరాబాద్‌సిటీ, వెలుగు: భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. బిహార్‌కు చెందిన రమేశ్ కుమార్, చందన్ కుమార్ మూడు బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వచ్చారు.
అనంతరం జేబీఎస్ కు చేరుకొని అక్కడ గుర్తు తెలియని వ్యక్తికి ఇచ్చేందుకు వేచి చేస్తున్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ డీటీఎప్ సీఐ సావిత్రి , సిబ్బంది కలిసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 17 లక్షల విలువైన 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు.