చూస్తూనే ఉంటారు కదా: మాల్స్లో టాయిలెట్ డోర్స్ కింద గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా..

చూస్తూనే ఉంటారు కదా: మాల్స్లో టాయిలెట్ డోర్స్ కింద గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా..

సాధారణంగా సినిమా హాళ్లలో, మాల్స్ లో, ఆఫీసుల్లో చాలా పరిశుభ్రంగా ఉంటుంది.. కానీ ఇక్కడి టాయిలెట్లను ఎప్పుడైనా గమనించారా? వాటి తలుపులు కింద నుంచి తెరుచుకుని ఉంటాయి. అంటే తలుపును సగం పైకి మాత్రమే అమర్చబడి ఉంటాయి. ఇలా ఎందుకు అమర్చుతారు. ఇంటి మరుగుదొడ్డికి ఇలా ఎందుకు అమర్చరు అనే సందేహం కలుగుతుంది. 

ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ తలుపు పైనుంచి కిందిదాక క్లోజ్డ్ గా ఉంటుంది. కానీ షాపింగ్ మాల్స్, థియేటర్ల, హాస్పిటల్స్ వంటి పబ్లిక్ టాయిలెట్లకు పూర్తి తలుపులు ఉండవు. అవి సగం వరకుమాత్రమే అమర్చబడి ఉంటాయి. హాస్టళ్లలో కూడా ఇది పరిస్థితి ఉంటుంది. రహస్యమేంటో తెలుసుకుందాం.. 

టాయిలెట్ గేట్లను చిన్నగా .. సగం డోర్ ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కిందనుంచి  తెరిచి ఉంటే వాటిని శుభ్రం చేయడం చాలా సులభం. టాయిలెట్లోకి ప్రవేశించకుండానే నీరు, ఇతర వ్యర్థాలు ఉన్నట్లయితే ఫ్లష్ చేయొచ్చు. దుర్వాసనలు ఆ గ్యాప్ ద్వారా బయటకు పోతాయి. 

ఇలాంటి తలుపులుండటం వల్ల టాయిలెట్లకు మంచి వెంటిలేషన్, లైటింగ్ ఉంటుంది. మరుగుదొడ్డి వాడే వ్యక్తికి ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే తలుపులు ఇలా పైకి లేపితే సులువుగా బయట పడొచ్చు. అటువంటి టాయిలెట్లలో పొగ తాగేవారిని ఈజీగా గుర్తించొచ్చు. 

మరుగుదొడ్ల తలుపులు కిందనుంచి గ్యాప్ ఉంచడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఎవరైనా బయట నుంచి తాళం వేసినా లేదా ఏదైనా ప్రమాదం జరిగినా తలుపులు తీయడం చాలా సులభం. పబ్లిక్ ఎక్కువగా ఉండే ఇలాంటి ప్రాంతాల్లో  ఈ సగం డోర్లు చాలా ఉపయోగపడతాయి. 

పగలు రాత్రి పదే పదే ఉపయోగించడం వల్ల నీరు మళ్లీ మళ్లీ తలుపు దిగువ భాగంలోకి రావొచ్చు. ఇది తేమను కలిగిస్తుంది. తలుపులు దెబ్బతింటాయి. తలుపులు కింది నుంచి గ్యాప్ ఉంటే పాడు కాకుండా ఉంటాయి. టాయిటెల్ డోర్స్ కింది నుంచి గ్యాప్ ఉంచడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయన్నమాట..