
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయంలో ‘గరుడ ట్రస్ట్’ స్కీమ్ విధివిధానాలు ఖరారు చేస్తూ ఆఫీసర్లు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గరుడ ట్రస్ట్‌కు మూడు కేటగిరీల్లో విరాళాలు సేకరించి, ఆ డబ్బులను విద్య, వైద్యం, ప్రసాద వితరణకు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. విరాళం ఇచ్చిన భక్తులకు బ్రేక్, ప్రత్యేక దర్శనం, అభిషేకం లడ్డూ ప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలు (కల్యాణ షెల్లా, కనుము) అందజేస్తారు.
గరుడ ట్రస్ట్ స్కీమ్ కింద సేకరించే విరాళాలను రూ.50 వేలు, రూ. లక్ష, రూ.2 లక్షలు మూడు కేటగిరీలుగా విభజించారు. రూ.50 వేలు ఇచ్చే భక్తులకు ఏడాదిలో రెండు సార్లు బ్రేక్, స్పెషల్ దర్శనాలు, రూ. లక్ష ఇచ్చే భక్తులకు నాలుగుసార్లు బ్రేక్ , స్పెషల్ దర్శనాలు ( రెండు విభాగాల్లో ఆరుగురికి), రూ.2 లక్షల ఇచ్చే భక్తులకు ఎనిమిదిసార్లు బ్రేక్ , స్పెషల్ దర్శనాలు(ఆరుగురికి) లైఫ్ టైమ్ ఉంటాయి. భక్తులకు వసతి, దర్శన కూపన్లతో పాటు ప్రత్యేక బాండ్ సదుపాయాలు కల్పిస్తారు.