
కర్నూల్ జిల్లా వెల్దుర్తిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. పేలుడు శబ్ధం విన్న స్థానికులు వెంటనే 108 కి ఫోన్ చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.