హిండెన్ బర్గ్ కేసులో SEBI క్లీన్ చిట్..రెండు రోజుల్లో లక్ష కోట్లు పెరిగిన అదానీ సంపద..

హిండెన్ బర్గ్ కేసులో SEBI క్లీన్ చిట్..రెండు రోజుల్లో లక్ష కోట్లు పెరిగిన అదానీ సంపద..

హిండెన్​ బర్గ్​ కేసులో సెబీ క్లీన్​ చిట్​.. అమాంతం పెరిగిన గౌతమ్​ అదానీ సంపద.. క్లీన్​చిట్​ఇచ్చిన తర్వాత కేవలం రెండురోజుల్లో 13బిలియన్​ డాలర్లు అంటే దాదాపు లక్షా 15వేల 348 కోట్లు సంపద పెరిగింది. దీంతో గౌతమ్​ అదానీ నికర సంపద ప్రస్తుతం 95.7బిలియన్​ డాలర్లకు చేరింది.ముఖేష్​ అంబానీని అధిగమించి భారత్​ లో అత్యంత ధనవంతుడిగా మారేందుకు అత్యంత చేరువయ్యారు. బ్లూమ్​ బెర్గ్​ బిలియనీర్స్​ ఇండెక్స్​ ప్రకారం.. రిలయన్స్​ఇండస్ట్రీ చైర్మన్​ ముఖేష్​ అంబానీ సంపద 98.6బిలియన్​ డాలర్లుగా ఉంది. 

గ్రూప్ కంపెనీల షేర్లలో పదునైన ర్యాలీ కారణంగా గౌతమ్ అదానీ సంపదలో నాటకీయంగా పెరిగింది. రిపోర్టుల ప్రకారం..2025 నాటికి గౌతమ్ అదానీ నికర విలువ 8లక్షల  49వేల 673 కోట్లు. (95.7 బిలియన్ల డాలర్లు) ముఖేష్ అంబానీ నికర విలువ8లక్షల 75వేల 640కోట్లు. ముఖేష్ అంబానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 18వ స్థానంలో ఉండగా, అదానీ 19వ స్థానంలో ఉన్నారు. 2025లో గౌతమ్ అదానీ నికర విలువ $17.1 బిలియన్లు పెరిగింది.ఇది ముఖేష్ అంబానీ నికర విలువలో నమోదైన $8.02 బిలియన్ల పెరుగుదల కంటే రెట్టింపు.

సంపదలో అకస్మాత్తుగా పెరుగుదల ఎందుకు?

ఇటీవల హిండెన్‌బర్గ్ షార్ట్-సెల్లింగ్ కేసులో అదానీ గ్రూప్‌కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుండి క్లీన్ చిట్ లభించింది. సెబీ తుది ఉత్తర్వులో అదానీ గ్రూప్ తన లిస్టెడ్ యూనిట్లలోకి నిధులను మళ్లించడానికి సంబంధిత పార్టీ లావాదేవీలపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. అదానీ గ్రూప్​ ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని SEBI నిర్ధారించింది.

►ALSO READ | BSNL బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలకే హై స్పీడ్ ఇంటర్నెట్.. FTTH ప్లాన్స్ ఇవే..