రోహిత్, కోహ్లీని మించినోడు.. అతని స్థాయే వేరు: పాక్ క్రికెటర్‌ను మెచ్చుకున్న గంభీర్

రోహిత్, కోహ్లీని మించినోడు.. అతని స్థాయే వేరు: పాక్ క్రికెటర్‌ను మెచ్చుకున్న గంభీర్

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఒక అంచనాకు రావడం కష్టం. అతని ఉద్దేశ్యం ఏదైనా చేసే కామెంట్స్ మాత్రం బోల్డ్ గా ఉంటాయి. ఈ కారణంగానే  ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ధైర్యంగా చెప్పగలడు అని పేరున్నా అతను చేసే కామెంట్స్ కి విమర్శలు తప్పవు. తాజాగా పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజామ్ ని ప్రశంసిస్తూ టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని తక్కువ చేసి మాట్లాడాడు. 

వరల్డ్ కప్‌లో బాబర్‌కే నా ఓటు

"బాబర్ అజామ్ కి ఎలాంటి సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ఇప్పటికే 104 వన్డేల్లో 19 సెంచరీలు చేసాడు. అతను ఎలా ఆడాలో బాగా తెలుసు. ఎవ్వరికి సమాధానం చెప్పుకోనవసరం లేదు. కోహ్లీ, రోహిత్, వార్నర్ లాంటి ఆటగాళ్లు ఉన్నా.. ఈ వరల్డ్ కప్ లో బాబర్ అజామ్ చెలరేగి ఆడతాడు. ఈ టోర్నీ అంతా అతని హవానే ఉంటుంది". తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రస్తుతం గంభీర్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. బాబర్ ని ప్రశంసించడంలో తప్పు లేదు కానీ కోహ్లీ, రోహిత్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు కాస్త ఓవర్ గా అనిపించాయని భారత క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.                  

 కాగా, ఇటీవల జరిగిన ఆసియా కప్ లో నేపాల్ మీద భారీ సెంచరీ తప్ప మిగిలిన మ్యాచుల్లో బాబర్ విఫలమయ్యాడు. ప్రస్తుతం వన్డేల్లో బాబర్ టాప్ ర్యాంక్ లో ఉండగా.. టీమిండియా యువ సంచలనం గిల్ అతనికి సమీపంలో ఉన్నాడు. మరి గంభీర్ చెప్పినట్టుగా ఈ వరల్డ్ కప్ లో బాబర్ చెలరేగుతాడో లేదో చూడాలి.