V6 News

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విజేత గీతం

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విజేత గీతం

రామచంద్రాపురం(పటాన్​చెరు), వెలుగు: జాతీయ స్థాయిలో నిర్వహించిన స్మార్ట్​ ఇండియా హ్యాకథాన్​లో గీతం విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. గుజరాత్​లోని అహ్మదాబాద్ నోడల్ సెంటర్​లో ఇటీవల జరిగిన ఎస్ఐహెచ్–2025లో గీతం బీటెక్​ సీఎస్ఈ, ఏఐఎంల్ఎల్​సెకండియర్​విద్యార్థులు కె.కృష్ణప్రియ, అబ్దుల్ బాసిత్ హసన్, కె.అమోఘ్, యశ్వంత్, యక్త చావలి, శరణ్య మదీనా ప్రభుత్వ ఈ–కన్సల్టేషన్ మాడ్యూల్​లో ఏఐ ఆధారిత వేదికను అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రదర్శించారు. 

వారికి ఎస్ఐహెచ్​జ్యూరీ రూ.1.5 లక్షల ప్రైజ్​మనీ అందించి సత్కరించింది. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థులను వీసీ డీఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్​డీవీవీఎస్ఆర్.వర్మ, సీఎస్ఈ, ఏఐఎంఎల్​ విభాగాధిపతులు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, స్కూల్ ఆఫ్​ బిజినెస్ డీన్ అభినందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముసాయిదా చట్టాలు, నిబంధనలపై పౌరుల అభిప్రాయాలను సమర్థంగా విశ్లేషించవచ్చని ప్రాజెక్టు మెంటార్​చంద్రశేఖర్​తెలిపారు.