గాలోడు చిత్రంలో గెహన సిప్పి

గాలోడు చిత్రంలో గెహన సిప్పి

‘చోర్ బజార్‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో హీరోయిన్‌‌‌‌గా పరిచయమైన గెహన సిప్పి త్వరలో ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సుడిగాలి సుధీర్ హీరోగా రాజ‌‌‌‌శేఖ‌‌‌‌ర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గెహన ఇలా ముచ్చటించింది. 

‘పుట్టి పెరిగిందంతా ముంబై. ఫొటోషూట్స్ కోసం హైదరాబాద్‌‌‌‌ వచ్చిపోయేదాన్ని. నా ఫొటోస్‌‌‌‌, వీడియోస్ చూసి తెలుగులో అవకాశాలు వచ్చాయి. డబ్బున్న కుటుంబం నుండి వచ్చిన యంగ్ క్యూట్ కాలేజ్‌‌‌‌ గర్ల్‌‌‌‌గా ‘గాలోడు’లో కనిపిస్తా. నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. క్లాస్ అమ్మాయి, మాస్ అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. సెట్‌‌‌‌లో అందరూ తెలుగులో మాట్లాడటం వల్ల నేనూ కొంత నేర్చుకున్నా. అందుకే డైలాగ్స్, యాక్టింగ్ విషయంలో నాకెలాంటి సమస్య రాలేదు. కానీ లడఖ్‌‌‌‌లో ఆక్సిజన్‌‌‌‌ లెవెల్స్‌‌‌‌ తక్కువ కనుక కొంత ఇబ్బంది పడ్డా. ఇక సుధీర్ సెట్‌‌‌‌లో చాలా సిగ్గుపడుతుంటాడు. మంచి వ్యక్తి, అందర్నీ కంఫర్ట్‌‌‌‌లో ఉంచుతాడు.

డైరెక్టర్ చాలా కూల్. సినిమాపై ఫుల్ పాజిటివ్‌‌‌‌గా, కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నా. టాలీవుడ్‌‌‌‌కి రాకముందే చాలా తెలుగు సినిమాలు చూశా.  శేఖర్ కమ్ముల గారితో పని చేయాలని ఉంది. సాయిపల్లవి ఫేవరేట్ హీరోయిన్. తెలుగు సినిమాలన్నా, వాటిలోని మాస్‌‌‌‌ స్టెప్పులన్నా ఇష్టం. డీసెంట్‌‌‌‌గా ఉండే స్పెషల్ సాంగ్స్‌‌‌‌ చేయడానికి రెడీ. గ్లామర్‌‌‌‌ రోల్స్‌ తో పాటు  నటిగా నిరూపించుకునే పాత్రలు చేయాలనుంది.నాకు రెండూ కంఫర్ట్‌‌‌‌గానే ఉంటాయి. స్క్రిప్ట్ బాగుంటేనే ఓ మూవీకి ఓకే చెబుతా. ఆ తర్వాతే టీమ్‌‌‌‌ గురించి ఆలోచిస్తా. కానీ సినిమాకు రెండూ ముఖ్యమే’.