ఫ్లోర్‌‌ టెస్ట్‌ గురించి ప్రస్తావించకుండా అసెంబ్లీ సెషన్‌పై మరో లేఖ రాసిన అశోక్‌ గెహ్లాట్‌

ఫ్లోర్‌‌ టెస్ట్‌ గురించి ప్రస్తావించకుండా అసెంబ్లీ సెషన్‌పై మరో లేఖ రాసిన అశోక్‌ గెహ్లాట్‌

జైపూర్‌‌: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తన బలం నిరూపించుకునేందుకు ఫ్లోర్‌‌ టెస్ట్‌ నిర్వహించాలని కోరిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మరోసారి గవర్నర్‌‌కు లేఖ రాశారు. అయితే ఆదివారం రాసిన ఈ లేఖలో ఫ్లోర్‌‌ టెస్ట్ గురించి ప్రస్తావించకుండా కేవలం అసెంబ్లీ సమావేశం నిర్వహించుకునేందుకు పర్మిషన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. కొన్ని ముఖ్యమైన బిల్లులపై చర్చించాలని, కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించాలని అసెంబ్లీ సెషన్‌ నిర్వహించేందుకు పర్మిషన్‌ ఇవ్వమని ఆయన కోరారు. సచిన్‌ పైలెట్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరుగబాటు చేయడంతో కాంగ్రెస్‌కు అసెంబ్లీలో బలం తగ్గిపోయింది. అయితే తనకు బలం ఉందని నిరూపించుకునేందుకు అశోక్‌ గెహ్లాట్‌ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్‌‌ను పదే పదే కోరారు. కాగా.. ఆయన దానికి ఒప్పుకోలేదు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే.