తాండూరు కంది పప్పుకు జీఐ గుర్తింపు

తాండూరు కంది పప్పుకు జీఐ గుర్తింపు
  • తాండూరు కంది పప్పుకు జీఐ గుర్తింపు
  • ప్రకటించిన సెంట్రల్​ గవర్నమెంట్
  • ఇక ఎగుమతులకు లైన్‌‌ క్లియర్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు : తాండూరు కంది పప్పుకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌‌ ఇండికేషన్‌‌) లభించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పప్పుకు జీఐ గుర్తింపు ఇస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని తాండూరు ప్రాంతంలో ఈ పప్పు అధికంగా ఉత్పత్తి అవుతుంది. కంది పప్పు రకాల్లోనే తాండూరు పప్పుకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీనిలో ప్రొటీన్‌‌ శాతం 22–-24 వరకు ఉంటుంది. మిగతా పప్పులతో పోల్చితే ఇది మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో పాటు ఇతర రకాల పప్పులతో పోల్చితే రుచి ఎక్కువగా ఉంటుంది. మంచిగా ఉడుకుతుంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పంట  సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ పప్పుపై ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీ సైంటిస్టులు అనేక పరిశోధనలు నిర్వహించారు. తాండూరు పప్పుకు జీఐ గుర్తింపు రావడంపై యూనివర్సిటీ పరిశోధన విభాగం డైరెక్టర్‌‌ ప్రొ. జగదీశ్వర్‌‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ ఎగుమతులకు లైన్‌‌ క్లియర్‌‌ కావడంతో పాటు ఎక్స్​పోర్ట్స్ భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. జాతీయ మార్కెట్‌‌లోనూ భారీ డిమాండ్‌‌ ఉంటుందన్నారు