అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కథ ముగిసింది. మూడు ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ ఆడాలనే తన కోరికను ఇటీవలే బయట పెట్టాడు. అయితే ఈ విధ్వంసకర ఓపెనర్ కు జాతీయ సెలక్టర్ బెయిలీ ఊహించని షాక్ ఇచ్చాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి డేవిడ్ వార్నర్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించారు. దీంతో వార్నర్ కెరీర్ కు దారులు మూసుకుపోయాయి.
ALSO READ | Australia UK tour: స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌తో సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
"డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు. అతను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కు చేసిన సేవలకు మెచ్చుకోవాలి. వార్నర్ పాకిస్తాన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడు. అతన్ని మేము పరిగణలోకి తీసుకోము". అని ఆసీస్ చీఫ్ సెలక్టర్ బెయిలీ అన్నారు. తమ ఫేవరేట్ ప్లేయర్ ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా చూడొచ్చని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 2025 ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
ALSO READ | IND vs ZIM 2024: రింకూ సింగ్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో స్పెషల్ అవార్డు
భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న తర్వాత వార్నర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది (2024) ప్రారంభంలో పాకిస్థాన్‌తో తన చివరి టెస్టు ఆడి టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఈ సమయంలో టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని చెప్పిన ఈ ఆసీస్ ఓపెనర్.. అనుకున్నట్టుగానే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ALSO READ | Copa America 2024: అర్జెంటీనాదే కోపా అమెరికా కప్.. కంటతడి పెట్టుకున్న మెస్సీ
2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 110 టీ20ల్లో 3277 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ.. 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
8th July - David Warner confirmed his availability for the 2025 Champions Trophy.
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024
15th July - Australian selectors confirmed Warner won't be considered for Champions Trophy. pic.twitter.com/p23qXHCQdg