గీతం కౌటిల్యలో సౌకర్యాలు సూపర్​ : ఫిలిప్​ అకెర్​మాన్

గీతం కౌటిల్యలో సౌకర్యాలు సూపర్​ : ఫిలిప్​ అకెర్​మాన్
  • జర్మనీ రాయబారి ఫిలిప్​ అకెర్​మాన్​ 

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: పటాన్​చెరు పరిధిలోని గీతం యూనివర్శిటీ ప్రారంభించిన కౌటిల్యా స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ పాలసీలో సదుపాయాలు బాగున్నాయని జర్మనీ రాయబారి డాక్టర్​ ఫిలిప్​ అకెర్​మాన్​ అన్నారు. బుధవారం కౌటిల్య స్టూడెంట్లతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ, ఇక్కడి విద్యావిధానం, వనరులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయన్నారు. 

జర్మ​నీకి భారత్​ వాణిజ్య, వ్యాపార భాగస్వామిగా ఉందని, భారత్, యూరోపియన్​ యూనియన్​ల మధ్య ఒప్పందాలు మెరుగుపడటం శుభ సూచకమన్నారు. భారత్​ నుంచి జర్మనీకి వచ్చే విద్యార్ధుల సంఖ్య పెరుగుతోందని, ఇక్కడి విద్యార్ధులు అంకితభావంతో పని చేస్తారని అన్నారు. గీతం కౌటిల్యతో భవిష్యత్​లోనూ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామన్నారు.