జీజీ కాలేజ్ వీసీ దిష్టిబొమ్మ దహనం

జీజీ కాలేజ్ వీసీ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, వెలుగు: డిగ్రీ కాన్వొకేషన్ ఫీజు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ లోని జీజీ కాలేజ్ ముందు పీడీఎస్​యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్​ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కాన్వొకేషన్ ఫీజు రూ. 700 నుంచి 3,500 కు పెంచడం, ఇతర సర్టిఫికెట్ల ఫీజులు పెంచడం అన్యాయమని పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు.

పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్​యూ నాయకులు వంశీ, సాయిరాం, కళ్యాణ్, రామ్ , రాహుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.