మరోసారి సీఆర్ఎంపీ స్కీమ్

మరోసారి సీఆర్ఎంపీ స్కీమ్
  • 1,148 కి.మీ. రోడ్లను ఎజెన్సీలకు అప్పగించేందుకు ప్రణాళికలు
  • 5 ఏండ్లపాటు నిర్వహణ బాధ్యతలు
  • 9 అంశాలు, 4 టేబుల్ ఐటమ్స్​కు బల్దియా స్టాండింగ్ కమిటీ ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో మరోసారి సీఆర్ఎంపీ (కాంప్రహెన్సివ్ రోడ్డు డెవలప్​మెంట్ ప్రొగ్రాం) స్కీమ్ ప్రవేశపెట్టేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​​లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగగా, 9  అంశాలతోపాటు 4 టేబుల్ ఐటమ్స్​కు సభ్యులు ఆమోదం తెలిపారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్, కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్ తదితరులు హాజరయ్యారు. టేబుల్ ఐటమ్స్​లో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం, రోడ్డు అభివృద్ధి కోసం ఆస్తుల సేకరణ, వర్షపు నీటి కాలువ నిర్మాణం అంశాలు ఉన్నాయి. 

ఆమోదించిన ఎజెండా ప్రధాన అంశాలు

సీఆర్ఎంపీ(కాంప్రహెన్సివ్ రోడ్డు డెవలప్​మెంట్ ప్రొగ్రాం) రెండో దశ కింద1,142 కి.మీ. రోడ్లను రూ.2,828 కోట్ల వ్యయంతో 5 ఏండ్ల పాటు నిర్వహణకు ఏజెన్సీలకు అప్పగించేందుకు ఆమోదించారు. రివైజ్డ్ అంచనా వ్యయం మంజూరుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ కమిటీ ఆమోదం తెలిపింది.

ఈఈఎస్ఎల్ కాంట్రాక్ట్ ముగియడంతో ఎల్‌ఈడీ వీధి లైట్లు, సీసీఎంఎస్ బాక్సులు, ప్యానెల్ పోల్స్, కేబుల్స్, పాత స్తంభాల ఆపరేషన్, నిర్వహణతో పాటు కొత్త ఎల్‌ఈడీ లైట్లు, సీసీఎంఎస్ ఏర్పాటు కోసం రూ.897 కోట్ల (18% జీఎస్టీతో) అంచనాతో టెండర్ పిలవడానికి కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం పరిపాలన అనుమతితో అమలులోకి వస్తుంది.
    
ఖైరతాబాద్ జోన్​లోని వివిధ ప్రాంతాల్లో స్మార్ట్ పార్కింగ్ వసతులు, డిజిటల్ సపోర్ట్ కోసం ఎక్స్​టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవగా, అర్హత కలిగిన రెండు బిల్డర్స్ జ్రూతి సొల్యూషన్స్, జూకె  టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌పీ ఎగ్) గుర్తించింది. గత కమిటీ ఎజెండా (6వ వరుస సంఖ్య 27) ప్రకారం సమర్పించిన ప్రతిపాదనలను కమిటీ ఆమోదించింది.
    
చార్మినార్ పాత బస్టాండ్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్​ఫర్ బేసిస్ ప్రకారంగా 15 ఏండ్లు, ఆ తర్వాత మరో 5 ఏండ్లపాటు పెర్ఫార్మెన్స్ కండిషన్ ప్రకారంగా పెంచేందుకు అనుమతిస్తూ కమిటీ ఆమోదించింది.
    
ఎల్బీ నగర్ జోన్ హయాత్ నగర్ సర్కిల్ వార్డు నంబర్ 11 లోని  కుమ్మరి కుంట చెరువు నుంచి రాఘవేంద్ర కాలనీ బస్ డిపో వరకు రూ.6 కోట్ల  వ్యయంతో చేపట్టే బాక్స్​ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్ పిలవడానికి పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదిందించింది.