
- పైలెట్ ప్రాజెక్టు కింద మూసాపేట సర్కిల్లో అమలు
- తర్వాత సప్పుడు చేయని జీహెచ్ఎంసీ
- మంచి రిజల్ట్ ఉంటుందన్న అగ్రికల్చర్ వర్సిటీ, ఐసీఎంఆర్
- డీజిల్ ఖర్చు ఏ మాత్రం ఉండదు
- కమిషనర్ నిర్ణయం కోసం వెయిటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: దోమల నివారణకు రెగ్యులర్ఫాగింగ్కంటే కోల్డ్ ఫాగింగే మంచిదని రిపోర్టులు చెప్తున్నా బల్దియా ముందుకు పోవడం లేదు. పైగా ఆర్థిక భారం తగ్గే అవకాశమున్నా ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పైలెట్ ప్రాజెక్టు కింద కూకట్ పల్లి జోన్ లోని మూసాపేట్ సర్కిల్ లో కోల్డ్ ఫాగింగ్ చేశారు. దీని తర్వాత అక్కడ దోమల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. అంతేకాకుండా కోల్డ్ ఫాగింగ్ తో మంచి ఫలితాలు వస్తాయని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఎంటమాలజీ అధికారులు రిపోర్ట్ ఇచ్చాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కూడా బాగానే ఉందని తేల్చింది. దీనికి సంబంధించి త్వరలోనే రిపోర్ట్ ఇవ్వబోతోంది. అంతేకాకుండా కూకట్ పల్లి జోనల్‌కమిషనర్ కూడా కోల్డ్ ఫాగింగ్ చేసి ప్రాంతంలో జనాల అభిప్రాయాలను తెలుసుకుని దోమలు తగ్గుముఖం పట్టినట్లు నివేదిక ఇచ్చారు. కూల్ఫాగింగ్తో ఎన్నో ప్రయోజనాలున్నా అమలు చేయడంలో మాత్రం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
ఏటా రూ.25 కోట్ల ఖర్చు
గ్రేటర్ లో ఏండ్లుగా దోమల నివారణకు డీజిల్‌తో కూడిన మెషీన్లతో ఫాగింగ్ చేస్తున్నారు. దీనివల్ల దోమలు నశించినట్టు, తగ్గినట్టు తేలకపోయినా వేరే మార్గాలు లేక బల్దియా ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. ఈ ఫాగింగ్‌తో ఏటా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగానికి సుమారు రూ.25 కోట్ల వరకు ఖర్చవుతోంది. దీని స్థానంలో కోల్డ్ ఫాగింగ్ చేస్తే డీజిల్ ఖర్చే ఉండదు. ఈ ప్రక్రియలో ఆక్వా కె- ఓథ్రిన్అనే కెమికల్వాడి ఫాగింగ్ చేయాలి. దీనికి జతగా కేవలం నీళ్లను వాడితే సరిపోతుంది. దీనికి ఏడాదికి రూ.6 నుంచి 8 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. కోల్డ్ ఫాగింగ్ కోసం మెషీన్లు కొంటే సరిపోతుంది.
పాతవి సగం పని చేయట్లే..
బల్దియా పరిధిలో దోమల ఫాగింగ్ కోసం ఈసారి రూ.21 కోట్లు కేటాయించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో దోమల నియంత్రణ కోసం ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో 2,375 సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 18 వందల మంది బస్తీలు, గల్లీలు, ఇండ్లకు వెళ్లి ఫాగింగ్ చేస్తున్నారు. బల్దియా దగ్గర 1817 ఫాగింగ్ మెషీన్లు ఉండగా, వీటిలో సగం వరకు పనిచేయడం లేదు. ఎప్పుడో కొన్న మెషీన్లు కావడంతో రిపెయిర్ కూడా కావడం లేదని తెలుస్తోంది.
దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఎంటమాలజీ ఎస్ఈలు, సూపర్ వైజర్లు అన్ని మెషీన్లు పని చేస్తున్నాయని, రెగ్యులర్‌గా ఫాగింగ్చేస్తున్నామని రికార్డుల్లో రాసి డీజిల్ నొక్కేసి బయట అమ్ముకుంటున్నారు. పైగా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫాగింగ్ చేయాలని ఆదేశాలు ఉన్నా ఎక్కడా ఈ టైమింగ్స్అమలు కావడం లేదు. వీటన్నింటికీ చెక్‌పెట్టాలంటే కోల్డ్ ఫాగింగ్ అమలు చేయడమే మార్గమని కొందరు అధికారులు చెప్తున్నారు.