న్యూయార్క్ మేయర్​తో భేటీ

న్యూయార్క్ మేయర్​తో భేటీ

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ‘గుడ్ విల్’ కార్యక్రమంలో భాగంగా యూఎస్​లోని న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్​తో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ  హైదరాబాద్ రోజురోజుకు గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందన్నారు. గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ద్వారా అభివృద్ధి చెందిన సిటీలతో పరస్పర సహకారం, బిజినెస్​లో అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో కాలిఫోర్నియా సిటీతో సిస్టర్ సిటీ రిలేషన్​షిప్ ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్30 లోపు హైదరాబాద్​కు వచ్చి సిటీని సందర్శించాలని ఆడమ్స్​ను కోరారు. అభివృద్ధి పరిశీలించి టెక్నాలజీ, ఇతర ఒప్పందాలు చేసుకోవాలన్నారు.