
- ఇటీవల రివ్యూలోఆదేశించిన సీఎం
- త్వరలో విద్యుత్ అధికారులతో చర్చలు
- పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం
- ఒక్క పోల్కే సీసీ కెమెరా, వైఫై,
- వెదర్ అలెర్ట్ అనౌన్స్మెంట్, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్కూడా చెప్తుంది..
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎం ఆదేశాల మేరకు గ్రేటర్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సెక్రటేరియెట్, పీవీ మార్గ్, కేబీఆర్ పార్క్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేసి వాటి పనితీరు పరిశీలించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ పోల్స్ వైర్అండర్గ్రౌండ్నుంచి ఉండడంతో పాటు వాటికి సీసీ కెమెరా, వైఫై, వెదర్ అలెర్ట్ అనౌన్స్మెంట్, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్అందించే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల స్మార్ట్ పోల్స్ కు ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ పోల్స్‌పైన సెల్ ఫోన్స్ టవర్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించనున్నారు.
అడ్వర్టైజ్మెంట్లతో ఇన్‌కం ప్లాన్
గ్రేటర్ లో 9,103 కిలోమీటర్ల రోడ్లు ఉండగా, 5,45.484 స్ర్టీట్లైట్లున్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా మెయిన్‌రోడ్లు, స్ట్రీట్స్‌లో ఉండగా, 54 వేలకుపైగా లైట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటితో పాటు హైమాస్ట్ లైట్లు 6,531ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్ లో రూ.217.12 కోట్లతో ఎల్ఈడీ లైట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించింది. మెయింటెనెన్స్ కోసం ప్రతినెలా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో నగరంలో కొన్ని చోట్ల స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేసి వాటి పనితీరు పరిశీలించాలని సీఎం ఆదేశించడంతో బల్దియా ఆ పనిలో పడింది.
వీటిని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్(బీఓటీ) మోడ్ లో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ పోల్ కి అడ్వర్టైజ్మెంట్కోసం ఓ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పై వచ్చే యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంతో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వీటితో నిర్వహణ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. యాడ్స్‌కు డిమాండ్లేనిచోట బల్దియా నేరుగా మెయింటెన్ చేసే అవకాశముంది. దీనిపై ముందుగా విద్యుత్ అధికారులతో బల్దియా చర్చించనుంది. స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయదలిస్తే పోల్స్ ఉన్న ప్రాంతాల్లోనే రీ ప్లేస్ చేయాలా? లేకపోతే వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలా అనే దానిపై డిస్కస్ చేయనున్నారు.
ఏడాది కిందే పునాదులు
స్మార్ట్ పోల్స్ కి సంబంధించి ఏడాది కిందే హైడ్రా ఏర్పడక ముందే అడుగులు పడ్డాయి. ఇండస్ అనే సంస్థ స్మార్ట్పోల్స్ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. రెండేండ్ల కింద సచివాలయం వద్ద కూడా ఒక పోల్ఏర్పాటు కూడా చేశారు. వీటిని బల్దియాలోని ఈవీడీఎం కింద ఉన్న అడ్వర్టైజ్మెంట్వింగ్ కింద ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అంతలో హైడ్రా ఏర్పాటు కావడంతో ఈ బాధ్యతలు బల్దియాకు వచ్చాయి. దీంతో ముందుకు సాగలేదు. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్యాడ్చేసి కొత్త రకమైన స్మార్ట్పోల్స్ఏర్పాటు చేయనున్నారు.
యూఎస్‌లోని పలు నగరాల్లో స్మార్ట్ పోల్స్ ఉన్నాయి. ప్రజా భద్రత, కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ పోల్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎల్ఈడీ లైటింగ్, సీసీ కెమెరాలు, వై-ఫై, నెట్ వర్క్ సిగ్నల్స్, పొల్యూషన్ సెన్సార్లు, ఈవీ ఛార్జింగ్ తో పాటు ప్రకటనలు ఇచ్చేందుకు సైతం స్మార్ట్పోల్కు డిజిటల్ డిస్‌ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆదాయం నిర్వహణలో ఉపయోగపడుతోంది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో కూడా మూడేండ్ల కిందటే స్మార్ట్పోల్స్ఏర్పాటు చేశారు.