లాక్‌డౌన్‌ కు ‘దయ్యాల’ గస్తీ

లాక్‌డౌన్‌ కు ‘దయ్యాల’ గస్తీ

కెపూహ్: అది ఇండోనేసియాలోని కెపూహ్ అనే ఊరు. రాత్రి కాగానే ఆ ఊరి వీధుల్లో దయ్యాలు తిరుగుతున్నాయి. దీంతో ఇన్నాళ్లూ కరోనా అంటుకుంటది.. బయటకెళ్లకండి అంటే వినని జనం ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే ఉంటున్నారట. ఈ కాలంలో దయ్యాలేంటీ? అంటారా? అవి నిజమైనవి కావు. ఆ ఊరి పెద్దలే అలా కొందరికి దయ్యాల వేషాలేసి ఊళ్లోకి పంపుతున్నారట. చనిపోయినోళ్ల ఆత్మలు భూమి మీదే చిక్కుకుపోతే పొకాంగ్ (ఇండోనేసియాలో దయ్యాన్ని ఇలానే పిలుస్తారు) లుగా మారతాయని కెపూహ్‌‌ జనం నమ్ముతారు. అందుకే బయటకు పోవొద్దని చెప్పినా జనాలు మాట వింటలేరని ఆ ఊరి పెద్దలు ఇలా ‘దయ్యాల’ను వదులుతున్నారు.