Shubman gill double century: గిల్ రికార్డుల మోత

Shubman gill double century:  గిల్ రికార్డుల మోత

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లో యంగ్ స్టర్ శుభ్ మన్ గిల్ చెలరేగిపోయి ఆడాడు. ఇన్నింగ్స్ మొదటినుంచి దూకుడుగా ఆడిన గిల్ 145 బంతుల్లో డబుల్ సెంచరీ (208, 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు) సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తో గిల్ పలు రికార్డులు సృష్టించాడు. అతిచిన్న వయసులో (23 ఏళ్లు) డబుల్ సెంచరీ చేసిన తొలి  బ్యాట్స్ మెన్  గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకుఈ రికార్డు  ఇషాన్ కిషన్ (24 ఏళ్లు) పేరిట ఉండేది. ఇషాన్ కంటే ముందు రోహిత్ 26 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ కొట్టాడు.

అంతేకాకుండా న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు సైతం గిల్ ఖాతాలో చేరింది.  గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. 1999 లో సచిన్  న్యూజిలాండ్ పై 186 పరుగులు చేశాడు. హేడెన్ హామిల్టన్ (181), కల్లాఘన్ సెంచూరియన్(169) పరుగులతో లిస్టులో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో తొలి డబుల్ సెంచరీ చేసిన ఘనత కూడా గిల్ కే సొంతం. ఈ డబుల్ సెంచరీతో భారత్ తరుపున 5వ డబుల్ సెంచరీ నమోదయింది. తొలి డబుల్ సెంచరీ సచిన్ టెండూల్కర్ చేశాడు.

వన్డేల్లో వెయ్యి పరుగులు

గిల్ కు ఇది వన్డేలో మూడో సెంచరీ కాగా స్వదేశంలో రెండవది. 106 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్ లో కొట్టిన ఫోర్ తో గిల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ లో (19) వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న ప్లేయర్ గా గిల్ రికార్డ్ నెలకొల్పాడు.

మరిన్ని వార్తలు