ప్రియుడి ఆత్మహత్యకు బాధ్యత ప్రియురాలిది కాదు

ప్రియుడి ఆత్మహత్యకు బాధ్యత ప్రియురాలిది కాదు

న్యూఢిల్లీ: లవ్ ఫెయిల్యూర్ కారణంగా యువకుడు సూసైడ్ చేసుకుంటే దానికి అతడి లవర్​ను దోషిగా నిర్ధారించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బలహీన మనస్తత్వం కలిగిన వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయానికి వేరొకరిని నిందించలేమని తేల్చి చెప్పింది. 2023లో ఓ యువకుడు లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తనను ప్రేమించిన యువతి, అమె స్నేహితుడి కారణంగానే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లో వివరించాడు. దాని ఆధారంగా బాధిత యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. 

 తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రేరేపించారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై యువతి, ఆమె స్నేహితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని తమ పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పిటిషన్​ను జస్టిస్ అమిత్ మహాజన్ బుధవారం విచారించారు. వాదనల అనంతరం జస్టిస్ మహాజన్ స్పందిస్తూ.."ప్రేమ వైఫలమై ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే మహిళను, పరీక్షలో ఫెయిలై స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే ఎగ్జామినర్ ను బాధ్యులను చేయలేం’ అని చెబుతూ బెయిల్​ మంజూరు చేశారు.