టాలెంట్‌‌‌‌ స్ప్రింట్ న్యూ ప్రోగ్రామ్ విష్ ప్రారంభం

 టాలెంట్‌‌‌‌ స్ప్రింట్ న్యూ ప్రోగ్రామ్ విష్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: మహిళా ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం గ్లోబల్ ఎడ్‌‌‌‌టెక్ కంపెనీ టాలెంట్‌‌‌‌ స్ప్రింట్ విష్ (విమెన్ ఇన్ సిలికాన్ హార్డ్‌‌‌‌వేర్) ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. దీనిని గూగుల్ సపోర్ట్ చేస్తోంది. దీని కింద మూడో ఏడాది మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులకు 100 శాతం ఇంటర్న్‌‌‌‌షిప్ అందిస్తుంది. యాభై మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది.  

ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు 950 మంది మహిళా సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజనీర్ల జీవితాలను మార్చేసింది. వీరంతా ప్రపంచస్థాయి టెక్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. విష్ ప్రోగ్రామ్ విద్యార్థులకు సాంకేతికత, సాఫ్ట్ స్కిల్స్, హార్డ్‌‌‌‌వేర్ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆన్‌‌‌‌లైన్ శిక్షణ అందిస్తుంది. విద్యార్థులకు గూగుల్ సైట్‌‌‌‌లో బూట్ క్యాంప్ కూడా ఉంటుంది.