గ్లోబల్​ స్టార్టప్​ ఎకోసిస్టమ్​ రిపోర్ట్​

గ్లోబల్​ స్టార్టప్​ ఎకోసిస్టమ్​ రిపోర్ట్​
  •     స్టార్టప్​ జినోమ్​ అనే సంస్థ ఆసియా దేశాల్లోని నగరాలపై 2024 గ్లోబల్​ స్టార్టప్​ ఎకోసిస్టమ్​ రిపోర్ట్​ను 12వ సారి విడుదల చేసింది.
  •     గ్లోబల్​ స్టార్టప్ ఎకోసిస్టమ్​ నివేదికలో సింగపూర్​ ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన అంకుర సంస్థల నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత           స్థానాల్లో న్యూయార్క్​ నగరం, లండన్​లు వరుసగా నిలిచాయి. 
  •     ఈ జాబితాలో 6వ స్థానంలో బెంగళూరు, ఏడో స్థానంలో ఢిల్లీ, 10వ స్థానంలో ముంబయి, 26వ స్థానంలో పుణె నిలిచాయి. హైదరాబాద్​ తొలిసారిగా ఆసియాలోనే        19వ స్థానంలో నిలిచి స్టార్టప్​లకు అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందింది. 
  •     గత దశాబ్దంలో హైదరాబాద్​లో అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగి 200 నుంచి 7500లకు పైగా చేరుకుంది. ఈ అభివృద్ధి ఫలితంగా హైదరాబాద్​                ఆసియాలో అంకుర సంస్థలకు బెస్ట్​ ఎమర్జింగ్​ ఎకోసిస్టమ్​ కలిగిన నగరాల జాబితాలో స్థానం సంపాదించుకుంది.