హైదరాబాద్, వెలుగు : ఆసియా ప్రైమ్ మీడియా గ్లోబల్ టూరిజం అవార్డులను హైదరాబాద్లో శనివారం ప్రదానం చేసింది. ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నామినీలు వాటాదారులను ఒకచోట చేర్చింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా వచ్చారు. కమిటీ ఎంపిక చేసిన వారికి అవార్డులు ఇచ్చారు.
పర్యాటక రంగం కోసం వ్యక్తులు, సంస్థలు అందించిన సహకారానికి గుర్తింపు గ్లోబల్ టూరిజం అవార్డులు అని సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, నేపాల్, లక్షద్వీప్, మాల్దీవులతో సహా దక్షిణాసియా నుంచి 2,500 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చాయి. విశేషమైన సేవలందించిన టాప్ 30 ఎంటిటీలను కమిటీ గుర్తించింది.