హైస్పీడ్ తో కరుగుతున్న గ్రీన్ ల్యాండ్
గతంతో పోలిస్తే ఏడు రెట్లు పెరిగిన మెల్టింగ్
సముద్ర తీరప్రాంతాల్లో వరదలు వస్తాయని శాస్త్రవేత్తల హెచ్చరిక
గ్లోబల్‌వార్మింగ్ విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా మంచు కరుగుతోంది. దీనికి తగిన చర్యలు తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు ఏండ్లుగా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మరో స్టడీ ఇదే విషయాన్ని చెప్పింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ అయిన గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు కరిగిపోతోందని పేర్కొంది. ఆర్కిటిక్, అంట్లాటికా సముద్రాల మధ్యనున్న ఈ ఐలాండ్‌లోని ఐస్ గత మూడు దశాబ్దాలతో పోలిస్తే ఏడు రెట్ల వేగంతో కరిగిపోతోందని వెల్లడించింది. ఇదే స్థాయిలో మంచు కరిగిపోతూ ఉంటే, ఈ శతాబ్దం చివరి నాటికి ఏడాదికి 40 కోట్ల మంది తీరప్రాంత ప్రజలు ముంపును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇంటర్గవర్నమెంటల్ప్యానెల్ఆన్క్లైమెట్ఛేంజ్(ఐపీపీసీ) అంచనా వేసిన దాని కంటే ఇది 40 లక్షలు అధికమని తెలిపింది.
1992 నుంచి గ్లోబల్సీ లెవల్స్10.6 మిల్లీమీటర్లు పెరిగాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 96 మంది ధ్రువప్రాంతాల సైంటిస్టులు చేసిన ఈ స్టడీ నేచర్మేగజైన్లో పబ్లిష్ అయింది. 1992 నుంచి ఇప్పటి వరకు గ్రీన్‌ల్యాండ్‌లో 3.8 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని స్టడీ పేర్కొంది. అదే విధంగా మంచు కరిగిపోయే స్పీడ్పెరుగుతోందంది. 1990 ప్రాంతంలో ఏడాదికి 3,300 కోట్ల టన్నుల మంచు కరిగిపోగా… ప్రస్తుతమది 25,400 కోట్ల టన్నులకు చేరిందంది. దీన్ని బట్టి మూడు దశాబ్దాల్లో ఐస్మెల్టింగ్ఏడు రెట్లు పెరిగిందంది. ‘‘సముద్ర మట్టాల్లో సెంటీమీటర్పెరుగుదల నమోదయ్యే కొద్దీ, ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది వరదలకు గురవుతారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి గ్రీన్ల్యాండ్ఐస్మెల్టింగ్వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి ఏడాదికి 10 కోట్ల మంది ముంపు బారినపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ సంఖ్య 40 కోట్లకు చేరుకుంటుంది. ఇదేం చిన్న ప్రభావం కాదు. ఇదే జరిగితే కోస్టల్ కమ్యూనిటీస్సర్వనాశనమవుతాయి” అని ప్రొఫెసర్ఆండ్రూ షెపర్డ్హెచ్చరించారు. వాతావరణ పరిస్థితుల వల్ల 2013–2017 మధ్య ఐస్మెల్టింగ్స్లో అయినప్పటికీ, మళ్లీ పెరిగిందని స్టడీలో పేర్కొంది.
