ఏఐ ఫీచర్లతో జీమెయిల్‌‌‌‌, డాక్స్‌‌‌‌

ఏఐ ఫీచర్లతో జీమెయిల్‌‌‌‌,  డాక్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో జీమెయిల్‌‌‌‌,  డాక్స్‌‌‌‌ను   అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ చూస్తోంది. చాట్‌‌‌‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌‌‌‌ను  గూగుల్ తన సెర్చింజిన్‌‌‌‌, ఇతర  ప్రొడక్ట్‌‌‌‌లకు యాడ్ చేయాలనుకుంటోంది. ప్రస్తుతం పబ్లిక్  టెస్టింగ్‌‌‌‌ జరుగుతోందని  9 టూ 5 గూగుల్ పేర్కొంది.  

ఈ టెక్‌‌‌‌ కంపెనీ  ఏఐ ఫీచర్లను యాడ్‌‌‌‌ చేస్తూ టెస్ట్‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌ను యూఎస్‌‌‌‌లో ప్రారంభించిందని తెలిపింది.  ఈ ప్రోగ్రామ్‌‌‌‌ కోసం 18 ఏళ్లు దాటిన ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌,  స్టూడెంట్లను గూగుల్‌‌‌‌ ఆహ్వానించింది. ఈ–మెయిల్స్‌‌‌‌ రాయడంలో ఏఐ వాడడాన్ని టెస్ట్ చేస్తున్నారు.  అంతేకాకుండా ఈమెయిల్స్‌‌‌‌లో ఎమోజిలను కూడా వాడుకునేలా కొత్త ఫీచర్లను గూగుల్ యాడ్ చేస్తోందని 9 టూ 5 గూగుల్ పేర్కొంది.