మరో 30 ఏళ్లూ జీఎంఆర్‌‌ గ్రూపే!

 మరో 30 ఏళ్లూ జీఎంఆర్‌‌ గ్రూపే!

హైదరాబాద్​, వెలుగు: సిటీలోని రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు (ఆర్​జీఐఏ) ను మరో 30 ఏళ్లపాటు నిర్వహించడానికి  జీఎంఆర్​ హైదరాబాద్​ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్‌ లిమిటెడ్‌కు​ (జీహెచ్​ఐఏల్) మినిస్ట్రీ ఆఫ్ ​సివిల్​ ఏవియేషన్​ (ఎంఓసీఏ) గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. 2038 మార్చి 23 నుంచి 2068 మార్చి 22 వరకు జీహెచ్​ఐఏల్ ఎయిర్​పోర్టు నిర్వహణను చూస్తుంది. జీహెచ్​ఐఏల్ జీఎంఆర్​ ఇన్​ఫ్రా లిమిటెడ్​ (జీఐఎల్) కు  సబ్సిడరీ. 2008 మార్చిలో మొదలైన ఆర్​జీఐఏ, పబ్లిక్​–ప్రైవేట్​ పార్ట్​నర్​షిప్​ పద్ధతిలో నడుస్తున్న మొట్టమొదటి గ్రీన్​ఫీల్డ్​ఎయిర్​పోర్టు. ఏటా1.2 కోట్ల మంది  ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యంతో ఆర్​జీఐఏ షురువైంది. వచ్చే పదేళ్లలో ఈ సంఖ్యను 10 కోట్లకు పెంచుతారు.