మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి : జీఎంలు జి.దేవేందర్, ఎం.శ్రీనివాస్

మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి :  జీఎంలు జి.దేవేందర్, ఎం.శ్రీనివాస్

 

కోల్​బెల్ట్/​ నస్పూర్, వెలుగు: మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి నిలుస్తోందని మందమర్రి, శ్రీరాంపూర్​ ఏరియాల జీఎంలు జి.దేవేందర్, ఎం.శ్రీనివాస్​ అన్నారు. శుక్రవారం తమ ఆఫీస్​లలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. ఉత్తమ ఉద్యోగులను జీఎం దేవేందర్​–స్వరూపరాణి, జీఎం శ్రీనివాస్–ఉమాదేవి దంపతులు సన్మానించారు. సింగరేణి హైస్కూల్స్ ​విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. .

సింగరేణి కార్మిక వాడల్లో సంబురాలు

మందమర్రి, రామకృష్ణాపూర్ సింగరేణి కార్మిక వాడల్లో స్వాతంత్ర్య వేడుకలు సంబురంగా జరుపుకున్నారు. మందమర్రి మార్కెట్​లో, రామకృష్ణాపూర్ సూపర్​బజార్​లో కాంగ్రెస్​ ప్రెసిడెంట్లు నోముల ఉపేందర్​గౌడ్, పల్లె రాజు, సొతుకు సుదర్శన్, పిన్నింటి రాఘునాథ్​రెడ్డి, మందమర్రిలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ జెండాలను ఆవిష్కరించారు.